Duration 5:53

సుందర బృందావనిలో, Sundara Brundaavanilo, Krishnarjunulu, 1982, Best of Veturi, Sathyam, Dasari

859 watched
0
5
Published 5 Oct 2020

కృష్ణార్జునులు, 1982 నిర్మాత: జయకృష్ణ దర్శకత్వం: దాసరి నారాయణ రావు మధుర బాణీల సత్యం, మృదుల భావాల నేస్తం, సాహిత్యాన్ని ప్రేమించి సంగీతమందించి, శ్రోతల మనసులలో కుదురుకున్న వాడు శ్రీ సత్యం గారు, ఒక గమనిక: దర్శకుడిగా పెద్ద పేరు తెచ్చుకోవాలన్నా, కలకాలం ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలన్నా చిత్రం లోని పాటలు ప్రజాదరణ పొందాలి, అలాంటి అదృష్టం కలిగిన దర్శకులు శ్రీ దాసరి రచన: వేటూరి సుందర రామ మూర్తి సంగీతం: సత్యం గానం: పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పల్లవి: సుందర బృందావనిలో ఈ సుందరి సుమసుకుమారి సుందర బృందావనిలో ఈ సుందరి సుమసుకుమారి జీవన సంగీతంలో తొలిపల్లవిగా తను మారి శృతి నీవు అంది లయ నేను అంది కనుచూపె కళ్యాణమంది సుందర బృందావనిలో ఈ సుందరి సుమసుకుమారి చరణం: నా మధుమాసాల ఉదయినిగా నా మందహాసాల మధువనిగా చిరుకాటుకలలదితే చీకటిగా చిరుకాటుకలలదితే చీకటిగా సిరిమల్లె తురిమితే పున్నమిగా స్వరమైతే నీవు జతి నేను అంది మనసంటే మాంగల్యమంది మనసంటే మాంగల్యమంది సుందర బృందావనిలో ఈ సుందరి సుమసుకుమారి చరణం: ఆ రూపు లావణ్య సుమలతికా ఆ చూపు కైలాస హిమకళికా ఆ రూపు లావణ్య సుమలతికా ఆ చూపు కైలాస హిమకళికా ఉలిచూపు తగిలితే శిల్పముగా ఉలిచూపు తగిలితే శిల్పముగా చెలికాలు కదిలితే నాట్యముగా భావాలు నీవి రాగాలు నావి సగమైతే జగమూగునంది సగమైతే జగమూగునంది సుందర బృందావనిలో ఈ సుందరి సుమసుకుమారి జీవన సంగీతంలో తొలిపల్లవిగా తను మారి శృతి నీవు అంది లయ నేను అంది కనుచూపె కళ్యాణమంది కనుచూపె కళ్యాణమంది సుందర బృందావనిలో సుందరి సుమసుకుమారి సుందరి సుమసుకుమారి

Category

Show more

Comments - 0